
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. తెలుగుతోపాటు తమిళం భాషలలో వరుస సినిమాలతో అలరిస్తుంది. అప్పట్లో న్యూస్ రీడర్.. అలాగే సీరియల్స్ ఆర్టిస్టుగా రాణించింది. కెరీర్ తొలినాళ్లల్లోనే బుల్లితెరపై పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తమిళంలో ఒకప్పుడు ఆమె న్యూస్ రీడర్. అలాగే కళ్యాణం ముధల్ కాదల్ వరై సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత 2017లో మియాదమన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత తెలుగులో గోపిచంద్ సరసన భీమా చిత్రంలో నటించింది. ఇవే కాకుండా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాతోనూ అలరించింది.
సినిమాలే కాకుండా అటు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలోనూ రాణించింది. అక్కినేని నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం సరైన బ్రైక్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..