
సౌత్ ఇండస్ట్రీలో అతడు టాప్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి.. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 30 నిమిషాల పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..? ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
రామాయణ చిత్రంలో బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు టాలీవుడ్, కోలీవుడ్ తారలు సైతం నటిస్తున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ రాకీ భాయ్ అలియాస్ యష్ సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రావణుడిగా యష్ కనిపించనుండగా.. మండోధరి పాత్రలో కాజల్ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా యష్ ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. నటుడి తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవర్ గానే పనిచేస్తున్నారు. నటనపై ఆసక్తితో రూ.300 తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ చేసి.. కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Yash Movie
ప్రస్తుతం రామాయణ చిత్రంలో రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్న రెండవ అత్యంత ఖరీదైన నటుడు యష్ కావడం విశేషం. ఇందులో రాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ రూ.150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఈసినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. రామాయణం పార్ట్ 1’లో యష్ కేవలం 15 నిమిషాల పాత్రను మాత్రమే పోషించాడు. ఇందుకు రూ.50 కోట్లు తీసుకుంటున్నాడట. రాకీ భాయ్ ఒకప్పుడు ఆదాయం కోసం టీ అందించేవారట. కెరీర్ తొలినాళ్లల్లో డబ్బు సంపాదించడం కోసం ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..