Murali Sharma: ఈ నటుడి భార్య ఇండస్ట్రీలో తోపు నటి.. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు మురళిశర్మ. యంగ్ హీరోహీరోయిన్లుగా తండ్రిగా, సహయ నటుడిగా కనిపిస్తూనే అటు విలన్ పాత్రలతోనూ అదరగొట్టేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఈ నటుడి భార్య సైతం ఇండస్ట్రీలో తోపు నటి. ముఖ్యంగా విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది.

Murali Sharma: ఈ నటుడి భార్య ఇండస్ట్రీలో తోపు నటి.. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Murali Sharma

Updated on: Jun 13, 2025 | 5:27 PM

తెలుగు సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి పాత్రలలోనైనా ఒదిగిపోయే నటుడు మురళిశర్మ. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా, విలన్ పాత్రలతో మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రలలో తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. తెలుగులో అల్లు అర్జు్న్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో ఆయన నటన సినిమాకే హైలెట్. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగువారికి దగ్గరయ్యారు. తెలుగులో ఇప్పుడు టాప్ యాక్టర్స్ లో ఆయన ఒకరు.

అయితే ముందుగా టీవీ సీరియల్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన మురళి శర్మ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ పాత్రతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? మురళీ శర్మ సతీమణి సైతం తోపు నటి. అవును.. హీందీలో ఇప్పుడు అనేక సీరియల్స్ చేస్తుంది.

మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్ శేఖర్. అల్లు అర్జున్, తమన్నా కాంబోలో వచ్చిన బద్రినాథ్ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరాఠీ, హిందీ సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు. తెలుగులో బద్రినాథ్, నిప్పు సినిమాలతోపాటు మోహబూబా చిత్రంలోనూ కనిపించారు. ప్రస్తుతం హిందీ బుల్లితెరపై బిజీగా ఉన్నారు.

Murali Sharma Wife

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..