OTT Movie: వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమా.. 2 గంటలు చెమటలు పట్టించే సీన్స్.. ఒంటరిగా చూస్తే అంతే సంగతులు..

ఈమధ్య కాలంలో సినీప్రియులు ఎక్కువగా హార్రర్ మూవీస్ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి జానర్ సినిమాలు తెరకెక్కించేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే ఓ హార్రర్ మూవీ ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అప్పట్లో ఆ చిత్రానికి ఊహించని రిజల్ట్ వచ్చింది.

OTT Movie: వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమా.. 2 గంటలు చెమటలు పట్టించే సీన్స్.. ఒంటరిగా చూస్తే అంతే సంగతులు..
Horror Movie

Updated on: Jun 15, 2025 | 5:00 PM

సాధారణంగా చాలా మందికి హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. క్షణక్షణం భయం, ఉత్కంఠతో ఉండే సినిమాలు జనాలను ఎక్కువగా అలరిస్తాయి. ఈమధ్యకాలంలో ఓటీటీతోపాటు థియేటర్లలోనూ హారర్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఈ జానర్ చిత్రాలను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా దాదాపు 30 ఏళ్ల కిందట నిర్మించారు. ఆ సినిమా స్త్రీ 2, ముంజ్య చిత్రాల కంటే చాలా భయాంకరమైనది. అదే హౌస్ నంబర్ 13. 90లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. హిందీలో వచ్చిన ఈ సినిమాకు బేబీ దర్శకత్వం వహించారు.

తమిళంలో పతిమునం నంబర్ వీడు సినిమాకు రీమేక్ ఇది. సౌత్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేశారు. కథ విషయానికి వస్తే.. తమ పాత పూర్వీకుల ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సుధీర్, అతడి భార్య శాంతి, కుమార్తె ఆర్తి.. అతడి తాత, సోదరుడు, తల్లితో కలిసి ఆ ఇంట్లో నివసిస్తుంటారు. అయితే ఆ ఇంట్లో పరిస్థితులు నిత్యం వారికి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంటాయి. క్షణక్షణం ఊహించని సంఘటనలతో భయపడిపోతుంటారు. గతానికి ప్రతీకారణం తీర్చుకోవాలని కోరుకునే కుటుంబాన్ని ఏదో ఒక శక్తి ఇబ్బంది పెడుతుంది. మోనాలిసా పెయింటింగ్ నుంచి జుట్టు బయటకు రావడం.. విదూషకుడి బొమ్మ వంటి దృశ్యాలు మిమ్మల్ని మరింత భయపెడుతుంటాయి.

ఈ సినిమా ఆధ్యంతం భయానకంగా సాగుతుంది. ఇందులో రీటా భాదురి, అనిల్ ధావన్, శరత్ సక్సేనా ముఖ్యపాత్రలు పోషించగా.. అప్పట్లో దాదాపు 60 లక్షల బడ్జెట్ తో ఈ చిత్రాన్నినిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏకంగా రూ.1.5 కోట్లు సంపాదించింది. ఈ చిత్రానికి IMDBలో రూ.6.1 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..