నడుము ఒంపుల వయ్యారి.. కాటుక కన్నుల చిన్నది.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఫస్ట్ మూవీతోనే భయపెట్టేసింది..

ఇటీవల టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతోంది. ఆషికా రంగనాధ్, అనికా సురేంద్రన్, శ్రీలీల, కావ్య కళ్యాణ్ రామ్..

నడుము ఒంపుల వయ్యారి.. కాటుక కన్నుల చిన్నది.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఫస్ట్ మూవీతోనే భయపెట్టేసింది..
Bandhavi Sridhar
Follow us

|

Updated on: Mar 25, 2023 | 6:00 PM

ఇటీవల టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతోంది. ఆషికా రంగనాధ్, అనికా సురేంద్రన్, శ్రీలీల, కావ్య కళ్యాణ్ రామ్.. ఇలా వీరందరూ కూడా తొలి సినిమాతోనే అటు అందం, ఇటు అభినయంతో ఎందరో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ కోవలోనే తాజాగా ఓ సూపర్ హిట్ చిత్రంతో తెలుగుతెరపైకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ. పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్‌ను చూశారా.? ఈమె గురించేనండీ చెప్పేది.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ సూపర్ హిట్ చిత్రంలో కీ రోల్‌లో కనిపించింది. తన నటనతో ఫ్యాన్స్‌ను తెగ భయపెట్టేసింది. మరి ఆమెవరో ఈపాటికైనా గుర్తొచ్చిందా.? మీరు ఇంకా కనిపెట్టలేకపోతే.. మేమే చెప్పేస్తాం..

ఆమె మరెవరో కాదు.. బాంధవి శ్రీధర్. సూపర్ హిట్ హారర్ మూవీ ‘మసూద‘లో ప్రధాన పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. తన నటనకు గానూ మంచి మార్కులు దక్కించుకుంది. అలాగే చైల్డ్ అరిస్ట్ కింద ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రభస’, ‘మొగుడు’, ‘రామయ్య వస్తావయ్య’, ‘మజ్ను’ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ భామ 2019లో మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ టైటిల్స్‌ను గెలుచుకుంది. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుసపెట్టి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..