Shaakuntalam: ‘శాకుంతలం’ సినిమా కోసం వాడిన నగలన్ని నిజమైనవే.. ఎన్ని కిలోల బంగారు అభరణాలు ధరించారో తెలుసా ?..

|

Mar 25, 2023 | 11:14 AM

ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో వాడిన నగలన్ని నిజమైనవే అని అన్నారు.

Shaakuntalam: శాకుంతలం సినిమా కోసం వాడిన నగలన్ని నిజమైనవే.. ఎన్ని కిలోల బంగారు అభరణాలు ధరించారో తెలుసా ?..
Shaakuntalam
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత శకుంతలగా.. మలయాళీ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో వాడిన నగలన్ని నిజమైనవే అని అన్నారు.

ఈ సినిమా కోసం దాదాపు రూ. 14 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగారు వజ్రాల నగలను ఉపయోగించారట. దాన వీర శూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్పూర్తితో ఈ చిత్రంలో నటీనటులు ఉపయోగించిన నగలను బంగారు, వజ్రాలతో తయారుచేయించారట. పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతూ లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం సినిమా కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

శాకుంతలం చిత్రంలో హీరోయిన్ సమంత దాదాపు పదిహేను కిలోల బంగారు నగలను ధరించారట. వాటిలో దాదాపు పద్నాలుగు రకాల నగలను సమంత వేసుకుందని డైరెక్టర్ తెలిపారు. అలాగే హీరో దేవ్ మోహన్ 8-10 కిలోల బంగారు నగలను ధరించారట. మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే వజ్రాలతో డిజైన్ చేసిన దుస్తులు ధరించారని వెల్లడించారు. శాకుంతలం సినిమాలో దాదాపు 14 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణలను ఉపయోగించారని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.