ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!! మేము ఆయన అనుకున్నామే..

|

Jul 15, 2024 | 12:40 PM

సినిమాల్లో చేసేవి విలన్ పాత్రలే అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం ఆయన సూపర్ హీరో. కష్టం అన్నవారికి లేదనకుండా కాదనకుండా సాయం చేస్తున్నాడు సోను సూద్. ఇప్పటికి ఆయన చాలా మందికి సహాయం చేస్తున్నారు. అలాగే అభిమానుల కోసం ఏదైనా చేస్తున్నారు సోనూ.. ఇదిలా ఉంటే సోనూ సూద్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు.

ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!! మేము ఆయన అనుకున్నామే..
Sonu Sood
Follow us on

లోకం మెచ్చిన నటుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సోనూ సూద్. కరోనా లాంటి కష్టసమయంలో ప్రజల పాలిట దేవుడు అయ్యాడు. సొంత ఇళ్లకు వెళ్లలేక అవస్థపడుతున్న ఎంతో మందిని ఆదుకున్నాడు సోనూ సూద్. సినిమాల్లో చేసేవి విలన్ పాత్రలే అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం ఆయన సూపర్ హీరో. కష్టం అన్నవారికి లేదనకుండా కాదనకుండా సాయం చేస్తున్నాడు సోను సూద్. ఇప్పటికి ఆయన చాలా మందికి సహాయం చేస్తున్నారు. అలాగే అభిమానుల కోసం ఏదైనా చేస్తున్నారు సోనూ.. ఇదిలా ఉంటే సోనూ సూద్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే సోనూ సూద్ ఓ స్టార్ హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారని చాలామందికి తెలియదు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చరా సామి..! బోల్డ్ సీన్స్‌తో బుర్రపాడవ్వాల్సిందే.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

అవును సోనూ సూద్ లో హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఎవరో తెలుసా..? ఆమెతో సోనూ సూద్ సూపర్ హిట్ సినిమాలు చేశాడు కూడా.. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. అవును అనుష్క శెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది సోనూ సూద్. అనుష్క మొదటి సినిమా సూపర్. ఈ సినిమాకు పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు సూనూ సూద్ కూడా నటించారు.

ఇది కూడా చదవండి : కృష్ణంరాజు ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోను పరిచయం చేయాలనుకున్నారా..!

అయితే ఈ సినిమా కోసం పూరిజగన్నాథ్ సోనూ సూద్ ను కలిసినప్పుడు.. సినిమాలో మీ సిస్టర్ రోల్ కోసం ఓ హీరోయిన్ ను వెతుకుతున్నా కొత్త అమ్మాయి కావలి అని చెప్పాడట. దాంతో సునూ వెంటనే తాను జిమ్ లో ఓ అమ్మాయిని చూశాను ఆమె మన సినిమాలో కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి అనుష్కను పూరికి పరిచయం చేశాడట. ఆతర్వాత పూరిజగన్నాథ్ ఆమెకు సినిమా కథ చెప్పి హీరోయిన్ గా ఓకే చేశారట. ఈ విషయాన్నీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సోనూ.. అయితే చాలా మంది అనుష్కను నాగార్జున ఇండస్ట్రీకి తీసుకువచ్చారు అని అనుకుంటారు. మరికొంతమంది పూరిజగన్నాథ్ సినిమాల్లోకి తీసుకొచ్చారు అనుకుంటుంటారు. అయితే నిజానికి అనుష్కను రికమెండ్ చేసింది సోనూ సూద్. ఇక అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది అనుష్క. అనుష్క సోనూ సూద్ కలిసి సూపర్ సినిమా తర్వాత అరుంధతి సినిమాలో నటించారు. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే అనుష్క ఈ సినిమా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.