Salaar Movie: ‘సలార్’ సినిమాలో కనిపించిన శ్రియారెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే.. ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్స్ నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సలార్ సినిమాలో మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు శ్రియా రెడ్డి. ఇందులో రాధా రామ మన్నార్ పాత్రలో తన అద్బుతమైన నటనతో మెప్పించింది.

Salaar Movie: 'సలార్' సినిమాలో కనిపించిన శ్రియారెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే.. ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు..
Shriya Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 27, 2023 | 11:41 AM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను ఏలేస్తున్న సినిమా ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ బద్దలుకొడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్‏కు చేరవయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్స్ నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సలార్ సినిమాలో మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు శ్రియా రెడ్డి. ఇందులో రాధా రామ మన్నార్ పాత్రలో తన అద్బుతమైన నటనతో మెప్పించింది. దీంతో ఇప్పుడు శ్రియా రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

సలార్ సినిమాలో రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన అమ్మాయి శ్రియారెడ్డి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు సోదరి. శ్రియా రెడ్డి.. ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా విలనిజం పండించడంలో ఆమె నటన వేరేలెవల్. శ్రియా రెడ్డి ఓ మాజీ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన శ్రియా.. నిజానికి తెలుగమ్మాయే. మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు శ్రియా. 1977 నుంచి 1981 మధ్య ఇండియన్ టీమ్ తరపున 4 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు భరత్ రెడ్డి. కెరీర్ ప్రారంభంలో టీవీ ప్రజెంటర్, వీడియో జాకీగా పనిచేసింది శ్రియా.

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

2002లో సమురాయ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2006లో శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది సినిమాలో కథానాయికగా నటించింది. నిర్మాత జీకే రెడ్డి పెద్ద కుమారుడు.. హీరో విశాల్ అన్న విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు శ్రియా. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించినా.. శ్రియాకు అంతగా గుర్తింపు రాలేదు. ఇఫ్పుడు సలార్ సినిమాతో ఒక్కసారి అందరి చూపును ఆకర్షించింది. ప్రస్తుతం సలార్ 2, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రాల్లో నటిస్తుంది శ్రియా.

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.