Harish Kumar: ఈ హీరో గుర్తున్నాడా ?.. ప్రేమఖైదీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..

పెళ్లాం చెబితే వినాలి.. రౌడీ ఇన్‏స్పెక్టర్.. కాలేజీ బుల్లోడు.. ప్రేమ విజేతా.. ప్రాణదాత, మనవరాలి పెళ్లి ,బంగారు కుటంబం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Harish Kumar: ఈ హీరో గుర్తున్నాడా ?.. ప్రేమఖైదీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Harish Kumar
Follow us

|

Updated on: Jan 16, 2023 | 6:32 PM

ప్రేమ ఖైదీ సినిమాతో తెలుగు తెర పై సెన్సెషన్ క్రియేట్ చేశాడు హీరో హరీష్ కుమార్.. ఆ తర్వాత ప్రేమ కానుకగా.. ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పెళ్లాం చెబితే వినాలి.. రౌడీ ఇన్‏స్పెక్టర్.. కాలేజీ బుల్లోడు.. ప్రేమ విజేతా.. ప్రాణదాత, మనవరాలి పెళ్లి ,బంగారు కుటంబం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆంధ్రకేసరి, నటుడిగా ఒహో నా పెళ్లంట సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి హిట్స్ కొట్టారు. నార్త్ లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మెల్లగా ఈ హీరోకు అవకాశాలు దూరమయ్యాయి. దీంతో సహాయ పాత్రలలో కనిపించారు. ఇక ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇంతకీ హరీష్ ఏం చేస్తున్నారు ?.. ఎక్కడున్నారు అనే విషయాలు తెలుసుకుందాం.

హరీష్ కుమార్.. పుట్టి పెరిగింది హైదరాబాద్‏లోనే. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1979లో ముద్దుల కొడుకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రేమ కానుక… ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం వంటి చిత్రాలు హరీష్ కెరీర్ లో గుర్తిండిపోయే సినిమాలు. 13 ఏళ్ల వయసులోనే హీరోగా మారిన హరీష్ ఎక్కువగా ప్రేమకథ చిత్రాల్లోనే కనిపించారు. తెలుగుతోపాటు.. దక్షిణాది భాషల్లోనూ హరీష్ వరుస చిత్రాలు చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉందనుకున్న సమయంలోనే హరీష్ కు మెల్లగా అవకాశం రావడం తగ్గాయి. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం హరీష్ తన కుటుంబంతో కలిసి ముంబయిలోనే ఉంటున్నారు. 2021 డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలో కనిపించారు హరీష్. ఈ హీరో అటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ గా ఉంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.