Rules Ranjan: ‘రూల్స్ రంజన్’ సినిమాను మొదటి రిజెక్ట్ చేసింది ఆ హీరోనే.. కిరణ్ ముందు అనుకున్నది అతడినే..

|

Oct 07, 2023 | 2:04 PM

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ అండ్ లవ్ రొమాంటిక్ యాంగిల్ రూపొందించిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో కిరణ్ అబ్బవరం కాదట.

Rules Ranjan: రూల్స్ రంజన్ సినిమాను మొదటి రిజెక్ట్ చేసింది ఆ హీరోనే.. కిరణ్ ముందు అనుకున్నది అతడినే..
Rules Ranjan
Follow us on

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రూల్స్ రంజన్. ఇందులో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కథానాయికగా నటించింది. అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ అండ్ లవ్ రొమాంటిక్ యాంగిల్ రూపొందించిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో కిరణ్ అబ్బవరం కాదట.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట.ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు ముందుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని అనుకున్నారట. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్.. ఈ సినిమాకు సెట్ అవుతాడని అనుకున్నారట. ఇదే విషయంపై అతడిని సంప్రదించింది చర్చించారట. కానీ అప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉన్న నవీన్ ఈ సినిమాను ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో చివరకు ఈ మూవీని కిరణ్ అబ్బవరంతో తెరకెక్కించారట. విడుదలకు ముందు పాటలు, ట్రైలర్ తో ఎక్కువగా క్యూరియాసిటిని కలిగించిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఇక నవీన్ విషయానికి వస్తే.. జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న నవీన్.. ఆ తర్వాత మాత్రం ఎక్కువగానే గ్యాప్ తీసుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలను ప్రకటించినప్పటికీ చాలా కాలం పాటు తన సినిమాలను తీసుకురాలేదు. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అందులో అనుష్క శెట్టి కథానాయికగా నటించగా.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.