Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. 'OMG 2' సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే
Akshay Kumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 07, 2023 | 2:43 PM

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.

‘OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.  అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

అక్షయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.