
ఏఆర్ రెహమాన్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. అద్భుతమైన సంగీతంతో కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. మెలోడీ, మాస్ పాటలతో శ్రోతలను ఊర్రుతలూగించారు. భారతీయ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. అతడికి ఇప్పటికే భారీగా డిమాండ్ ఉంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆస్కార్ విజేత. వేలాది సూపర్ హిట్స్ సాంగ్స్ అందించాడు. సౌత్ ఇండియాలోనూ, బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎ.ఆర్. రెహమాన్ ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటారు. నివేదికల ప్రకారం, అతను ఒక పాట పాడినందుకు దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటారట. అవును.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా పేరు తెచ్చుకున్న సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్ తదితరుల రెమ్యునరేషన్ కంటే ఇది 15 రెట్లు ఎక్కువ.
ఎ.ఆర్. రెహమాన్ ఫుల్ టైమ్ సింగర్ కాదు. సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని అతి చిన్న వయసులోనే మొదలుపెట్టాడు. కానీ కొన్ని చిత్రాల్లో సాంగ్స్ ఆలపించాడు. ఒక్కపాటకు దాదాపు రూ.3 కోట్లు తీసుకుంటారు. కానీ రెహమాన్ ఎక్కువగా సాంగ్స్ పాడేందుకు ఆసక్తి చూపించరు. ఎందుకంటే.. అతడు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే తనను పాట పాడేందుకు ఎవరూ పిలవకుండా ఉండేందుకు అతను అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుంటాడని సన్నిహితులు అంటుంటారు. అయినా కొందరు నిర్మాతలు అంత డబ్బు చెల్లించి రెహమాన్ చేత సాంగ్స్ పాడించారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, సోనూ నిగమ్ ఇలా ఒక్కో పాటకి చాలా లక్షల రూపాయలు తీసుకుంటారు. శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకు 25 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే సునిధి చౌహాన్‌కు 18 నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇక బాలీవుడ్ సింగింగ్ సెన్సెషన్ ఒక్కో పాటకు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తాడు. ఇక సోనూ నిగమ్ ఒక్కో పాటకు 15 నుంచి 18 లక్షలు తీసుకుంటాడు.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.