కీర్తి సురేష్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ. నేను శైలజ అంటూ ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత మహానటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. కీర్తి చైల్డ్ ఆర్టిస్‌గా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ పరిశ్రమకు చెందినవారు కావడంతో కీర్తి సినీరంగ ప్రవేశం సులభంగానే జరిగింది. చిన్ననాటి నుంచి నటనవైపు అడుగులు వేసింది కీర్తి. 2000వ సంవత్సరంలో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. ఆతర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?.
బాలనటిగా పనిచేసినప్పుడు ఆమె మొదటి చెక్ తీసుకుంది. అప్పుడు ఆ చెక్ నేరుగా తన తండ్రికి ఇచ్చింది. ఆ తర్వాత కాలేజీలో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తొలి వేతనం తీసుకుంది. అప్పుడు కేవలం రూ.500 వచ్చాయి. అదే తన మొదటి రెమ్యునరేషన్ అని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇక ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 1 నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన దసరా చిత్రంలో వెన్నెల పాత్ర కోసం ఆమె రూ.2 కోట్లు తీసుకుందట. ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.