Kantara Chapter 1: కాంతార 2 బడ్జెట్ ఎంతో తెలుసా? రిషబ్ శెట్టి, రుక్మిణీల రెమ్యునరేషన్స్ వివరాలివే

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతారా ఛాప్టర్ 1. దసరా కానుకగా గురువారం (అక్టోబర్ 02) థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్స్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

Kantara Chapter 1: కాంతార 2 బడ్జెట్ ఎంతో తెలుసా? రిషబ్ శెట్టి, రుక్మిణీల రెమ్యునరేషన్స్ వివరాలివే
Kantara Chapter 1 Movie

Updated on: Oct 02, 2025 | 4:58 PM

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా ఛాప్టర్ 1 గురువారం (అక్టోబర్ 02) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
సుమారు మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ఇది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన రిషబ్ శెట్టినే ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించాడు. అలాగే తనే మెయిన్ లీడ్ లో నటించాడు. స్క్రీన్‌ప్లే తో పాటు డైలాగుల బాధ్యతలను కూడా రిషబ్ నే తీసుకున్నాడు. మరి ఇన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన రిషబ్ శెట్టి కాంతారా ఛాప్టర్ 1 కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు తమ సినిమాలకు నిర్మాతల నుంచి పారితోషికం తీసుకోరు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్లు పారితోషికానికి బదులుగా సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. ఇప్పుడీ ట్రెండ్ సౌత్ లోనూ మొదలైంది. ‘కాంతార: చాప్టర్ 1’ విషయంలో రిషబ్ కూడా ఇదే ఫాలో అయినట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

కాంతార పార్ట్ 1 కేవలం రూ.15-20 కోట‍్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అయితే ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1 కోసం భారీగా బడ్జెట్ వెచ్చించారు. ఈ మూవీ కోసం ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే సినిమా ద్వారా వచ్చే లాభాల్లో అతనికి హోంబాలే ఫిల్మ్స్ నుంచి వాటా దక్కనుందని తెలుస్తోంది.

కాంతార ఛాప్టర్ 1 సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అలాగే అజనీష్ లోక్ నాథ్ కు కూడా భారీగాన పారితోషికం అందినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.