బాబోయ్ ఎంత మారిపోయింది..! క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.. ? తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలోత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బాబోయ్ ఎంత మారిపోయింది..! క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
Sindhu Tolani

Updated on: Dec 17, 2025 | 11:29 AM

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ఐతే అనే మూవీ. ఈ సినిమా 2003లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఒక ముంబై భామ అడుగుపెట్టింది. పుట్టి, పెరిగింది ముంబై అయినా చూడడానికి అచ్చం పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించింది. అలా ఒక చిన్న సినిమాతో అందం, అభినయం పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించింది.. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత సహాయక పాత్రల్లో మెప్పించింది. ఆమె సింధు తులానీ. ఐతే తర్వాత కల్యాణ్‌ రామ్‌ అతనొక్కడే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ మూవీని ఖాతాలో వేసుకుంది. నవదీప్ నటించిన గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, ప్రభాస్ పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

ఇక తమిళ్ హీరో శింబు మన్మథ సినిమాలో సింధు పోషించిన నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక తెలంగాణ ప్రముఖ పండుగ బతుకమ్మ నేపథ్యంలో వచ్చిన బతుకమ్మ సినిమాలోనూ మెయిన్‌ లీడ్‌లో నటించి మెప్పించింది. సామాజిక సమస్యలపై తెరకెక్కిన పోతేపోనీ సినిమాలోనూ నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను పోషించింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే 2011 ఆది ప్రేమ కావాలి సినిమాలో మళ్లీ కనిపించి ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

దీని తర్వాత ఇష్క్‌ సినిమాలో నితిన్‌ అక్కగా కనిపించిన సింధు సన్నాఫ్‌ సత్యమూర్తిసినిమాలో అల్లు అర్జున్‌ వదిన పాత్రలో నటించి మెప్పించింది. కెరీర్‌ ప్రారంభంలో తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ అందాల తార ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. 2017 తర్వాత సింధు మరే సినిమాలోనూ కనిపించలేదు. కాగా సోషల్‌ మీడియాలోనూ పెద్దగా కనిపించని సింధు తులానీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో స్థిరపడింది. సింధు భర్త పేరు చేతన్‌. అతను నార్త్ ఇండియన్‌. ఐటీ ఆఫీసులో చేతన్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరికి శ్వేత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తన కూతురు ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది సింధు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..