హేయ్.. రుబా నువ్వేనా..! ఆరెంజ్ మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..!!

|

Aug 21, 2024 | 5:43 PM

మగధీరలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో చరణ్ నటన.. సినిమా స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత టీవీల్లో సూపర్ హిట్ అయ్యింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు.

హేయ్.. రుబా నువ్వేనా..! ఆరెంజ్ మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..!!
Orange
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఆరెంజ్ సినిమా ఒకటి. మగధీరలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో చరణ్ నటన.. సినిమా స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత టీవీల్లో సూపర్ హిట్ అయ్యింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడు థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

ఈ సినిమాకు రీ రిలీజ్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా.?ఆరెంజ్ సినిమాలో జెనీలియా మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ ఓ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ షాజన్ పదమ్సీ. ఆరెంజ్ మూవీలో రుబా పాత్రలో మెప్పించింది ఈ భామ.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్‌లో గాలిస్తున్నారు. ఆరెంజ్ సినిమాలో ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. షాజన్ పదమ్సీ తొలిసారిగా హిందీలో సినిమా చేసింది. రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌తో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఆ తర్వాత ఆరెంజ్ సినిమాలో నటించి మెప్పించింది. ఆరెంజ్ సినిమా తర్వాత ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఈ తర్వాత రామ్ పోతినేని, వెంకటేష్ కలిసి నటించిన మసాలా సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.