Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ లోనూ సత్తా చాటింది. అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి.

Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్
Rakul Preet
Follow us

|

Updated on: Aug 21, 2024 | 2:04 PM

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ రాణించింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయ్యింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ లోనూ సత్తా చాటింది. అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. కొత్త ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ కు మెల్లగా ఛాన్స్ లు తగ్గాయి.. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయినా జాకీ భగ్నాని తో ప్రేమాయణం సాగించింది. ఇటీవలే ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..

పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమాలో కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. గ్లామరస్ ఫొటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

రకుల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్నదాన్ని ప్రేమ అనాలో లేక నా అదృష్టం అనాలో తెలియడంలేదు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి రానప్పటికీ .. ప్రేక్షకులు నను ఆదరించారు. ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు, ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయాను. వేరు వేరు ఇండస్ట్రీలో పని చేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ.. ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతున్నాయి. ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. వాటంతట అవి జరిగిపోతున్నాయి.. జీవితంలో ఒక్కో మెట్టు ఎదగటానికి అవే సహాయం చేస్తాయంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..