AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి.

అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2024 | 5:36 PM

Share

దర్శక ధీరుడి రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలనీ ఎవరికీ మాత్రం ఉండదు. చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో  హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా క్యూలో నిలబడతారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ కారణంగా రాజమౌళి సినిమాకు నో చెప్పిందట.

ఇది కూడా చదవండి : Double Ismart : ఎంత పని చేశావ్ ‘బొక’..! డబుల్ ఇస్మార్ట్‌లో బెడిసికొట్టిన అలీ కామెడీ.. ఆ సీన్స్ డిలీట్.?

రాజమౌళి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అంటే రెమ్యునరేషన్ కారణంగా ఓ స్టార్ హీరోయిన్ ఆయన సినిమాకు నో చెప్పిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా నటించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది శ్రీదేవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్ కు నో చెప్పిందట శ్రీదేవి.

ఇది కూడా చదవండి :Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

బాహుబలి సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారట రాజమౌళి. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో షేర్ కూడా అడిగిందట. వీటితోపాటు ఆమె హోటల్ బిల్లులు, ఫైట్ ఛార్జ్ లు అన్ని కలుపుకొని దాదాపు రూ. 15కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారట. సినిమా బడ్జెట్ చాలా పెద్దది ఇప్పుడు ఇలా శ్రీదేవి ఒక్కరికే అన్ని కోట్లు పెట్టాలంటే మరింత భారం అవుతుందని మేకర్స్ భావించారట. అయితే శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఇరగదీశారు. శ్రీదేవి ఆపాత్ర ఒప్పుకోకపోవడం మంచిదైంది అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ కోసం సినిమా ఒప్పుకోవడం అనేది నిజం కాదు అని అన్నారు. అలా అయితే తాను 300లకు పైగా సినిమాలు చేసుండేదాన్ని కాదు అని ఆమె అన్నారు. ఏది ఏమైనా శ్రీదేవి ఓ అద్భుతమైన పాత్రను మిస్ చేసుకుంది.

ఇది కూడా చదవండి : Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

Sridevi

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..