AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

రీసెంట్ గా ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!
Raviteja
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2024 | 3:29 PM

Share

మాస్ మహారాజ రవితేజ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ హిట్ అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో రవితేజ తన ఎనర్జీతో ఆకట్టుకున్నపటికీ కథలో బలం లేకపోవడమతో మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో మనసిచ్చాను సినిమా ఒకటి.

ఇది కూడా చదవండి : Double Ismart : ఎంత పని చేశావ్ ‘బొక’..! డబుల్ ఇస్మార్ట్‌లో బెడిసికొట్టిన అలీ కామెడీ.. ఆ సీన్స్ డిలీట్.?

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడి పేరు మణిచందన. మనసిచ్చాను సినిమాలో రవితేజ లవర్‌గా నటించిన ఆమె అంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. తొలిప్రేమ సినిమాలో కీర్తి రెడ్డి ఫ్రెండ్‌గా కనిపించింది. ఆ తర్వాత పిల్ల నచ్చింది అనే సినిమాలో బ్రహ్మానందం భార్యగా కనిపించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్‌గా మారి రవితేజతో కలిసి సినిమా చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇది కూడా చదవండి :Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

అప్పుడు రవితేజ సరసన హీరోయిన్‌గా నటించిన ఆమె ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలోనూ నటించింది. మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతి బాబుకు భార్యగా.. ఇంటికి పెద్ద కోడలిగా యాక్ట్ చేసింది. అలాగే ఈ సినిమాలో రవితేజ, మణిచందన మధ్య సీన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు హీరోయిన్ గా నటించిన మణిచందన ఇప్పుడు అమ్మ, వదిన, అత్తాలాంటి పాత్రలు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆమె. ఇక ఇప్పుడు ఆమె ఎన్టీఆర్ దేవర సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. అలాగే అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చల మల్లి సినిమాలోనూ నటిస్తున్నారు మణిచందన.

ఇది కూడా చదవండి : Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..