అందరివాడు మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు అంతకు మించిన అందంతో కవ్విస్తోంది

|

Aug 22, 2024 | 8:42 PM

2005లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించారు. టబు, రిమీ సేన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు. టీవీ చానల్ లో రిపోర్టరుగా, మేస్త్రీగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రిమీ సేన్ గుర్తుందా.?

అందరివాడు మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు అంతకు మించిన అందంతో కవ్విస్తోంది
Andarivaadu
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అందరివాడు సినిమా ఒకటి. శ్రేణి వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సీనియమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2005లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించారు. టబు, రిమీ సేన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు. టీవీ చానల్ లో రిపోర్టరుగా, మేస్త్రీగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రిమీ సేన్ గుర్తుందా.? అందరివాడు సినిమాలో చిరంజీవి, రిమీ సేన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అందరివాడు సినిమా తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా కనిపించలేదు. ఇంతకూ ఆ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.?

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

రిమీ సేన్ బెంగాలీ, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. రిమీసేన్ అసలు పేరు సుభమిత్ర సేన్‌. చిన్నప్పటి నుండి నటి కావాలని కన్న కలలు నిజం చేసుకోవాలని చదువు పూర్తయ్యాక కోల్‌కతా నుండి ముంబైకి వచ్చింది ఈ చిన్నది. అమీర్ ఖాన్‌తో కోకా-కోలా యాడ్ లోనూ నటించింది. తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)  సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. హిందీలో ధూమ్ (2004), క్యోన్ కి (2005), గరం మసాలా (2005), గోల్‌మాల్ (2006) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

2015లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001), నీ తోడు కావాలి (2002), అందరివాడు (2005) తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఇక ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.