Sampangi : సంపంగి సినిమా హీరోయిన్ గుర్తుందా.? ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఇలా అస్సలు ఊహించివుండరు
లవ్ స్టోరీ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకునే వాటిలో సంపంగి సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సంపంగి ఈ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

లవ్ స్టోరీస్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు ప్రేక్షకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అందమైన ప్రేమ కథలు ప్రేక్షకులను అలరించాయి. ఇక లవ్ స్టోరీ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకునే వాటిలో సంపంగి సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సంపంగి ఈ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఎంతో మంది వింటూ ఉంటారు. ఇక ఈ సినిమాకు సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోగా దీపక్ నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు కంచి కౌల్. సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ షోలోనూ నటించింది. ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి. ఈ మూవీ 2001లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత చెప్పాలని ఉంది. ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది.




2005లో ఏక్ లడ్కీ అంజనీ సి అనే టీవీషోలో నటించింది. ఇదిలా ఉంటే కంచి కౌల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది . వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది కంచి కౌల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. మునుపటి మించి గ్లామరస్ గా కనిపిస్తోంది ఈ భామ. కంచి కౌల్ ఇప్పుడు ఎలా ఉందో మీరేచూడండి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.