అరాచకం భయ్యా..! అందాలతో గత్తరలేపుతోన్న ఖుష్బూకూతురు.. చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు ఆరాధ్య దేవతగా మారింది. ఈ అమ్మడు కోసం ఏకంగా గుడి కట్టేశారు అభిమానులు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 90’s లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది.

అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందిఈ అందాల భామ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు.
ఈ మధ్య ఖుష్బూ సినిమాలు తగ్గించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021 లో ఆమె రజనీకాంత్‌తో అన్నాత్తేలో కనిపించారు కుష్బూ. అలాగే తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, శర్వానంద్ హీరోగా నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాల్లో నటించారు ఖుష్బూ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలోజరిగే విషయాలతో పాటు ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ కూతురి కి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఖుష్బూ తమిళ్ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుర్లు.. వారిలో ఒకరే అవంతిక. ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది. అవంతిక అందంలో ఏమాత్రం తల్లికి తీసిపోదు. తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. ఓ వైపు చావుకుంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలు షేర్ చేసే అవంతిక.. అందాల ఆరబోతతోనూ కవ్విస్తుంది. తాజాగా వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది. ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..