
కొన్ని సినిమాలు భారీ విజయాలను సాధించకపోయినా.. ఎప్పుడు చూసిన బోర్ కొట్టావు. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా కథ అద్భుతంగా ఉంటే చాలు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పడతారు. ఇప్పటికే చాలా సినిమాలు అది నిరూపించాయి. అలాంటి సినిమాల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం. ప్రేక్షకులనియు ఆద్యంతం ఆకట్టుకునే కథ కథనంతో తెరకెక్కింది కేరాఫ్ కంచరపాలెం. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన కథతో వెంకటేష్ మహా హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కంచరపాలెం సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది ఆమె. సినిమాలో ఉన్న కొంతసేపు మాత్రమే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు పరుచూరి విజయ ప్రవీణ. ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో కనిపించింది. ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చదివి కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు.
తన స్నేహితురాలిని కలుసుకోవడానికి ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో పరిచయం ఏర్పడింది. దాంతో అతని ఆమె కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో చివరకు తానే నటించింది. అలాగే వెంకటేష్ మహాతెరకెక్కించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలోనూ నటించింది. అలాగే ఆ సినిమాను నిర్మించింది. ఇటీవలే ఆమె కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఆమె కనిపించడం లేదు. దాంతో నెటిజన్స్ ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని గూగుల్ లో గాలిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి