Devi Puthrudu: వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?
ఈ సినిమాలో సౌందర్యంతో పాటు అంజలి జవేరి కూడా నటించింది. ఇక ఈ సినిమా ఓ చిన్న పాప పాత్రే చాలా కీలకం. ద్యాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
వెంకటేష్ నటించిన దేవీ పుత్రుడు సినిమా గుర్తుందా..? సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2001లో వచ్చిన ఈ సినిమాకు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సౌందర్యంతో పాటు అంజలి జవేరి కూడా నటించింది. ఇక ఈ సినిమా ఓ చిన్న పాప పాత్రే చాలా కీలకం. ద్యాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈచిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీకృష్ణుడి పాటలోని ఓ చిన్నారి రూపం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. ఆ పాపే వేగా తమోటియా.
దేవి పుత్రుడు సినిమా తర్వాత ఈ పాప కనిపించినా అంతగా ఎవరు గుర్తుపట్టలేదు. ప్రస్తుతం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లుగా ఉంది. ఎంతో అందంగా అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. 1985 మే 7న చత్తీష్ ఘర్ లో జన్మించింది. హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు.తెలుగులో హౌస్ ఫుల్ సినిమాలో నటించింది.
అలాగే వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలనటిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన వేగా తమోటియా.. అవకాశాలు వస్తే త్వరలో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
View this post on Instagram