ఆ స్టార్ హీరోయిన్‌ను కాదని.. మరో క్రేజీ సీక్వెల్‌లో రష్మిక..
19 December 2024
Basha Shek
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప 2 మూవీ గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది.
డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 1400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల బద్దలు కొట్టింది
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప 2 మూవీ గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది.
ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ పేరుతో పాటు శ్రీవల్లిగా మెరిసిన రష్మిక మందన్నా పేరు కూడా మార్మోగిపోంతోంది.
పుష్ప 1 తో పోల్చితే పుష్ప 2లోనే రష్మికకు అభినయం పరంగా స్క్రీన్ స్పేస్ బాగా దొరికిందంటున్నారు ట్రేడ్ నిపుణులు.
ముఖ్యంగా జాతర సీన్ లో రష్మిక అభినయం అద్భుతంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉంది నేషనల్ క్రష్.
కాగా పుష్ప 2 తర్వాత మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
మారు పదమూడేళ్ల క్రితం సైఫ్ అలీఖాన్ ,దీపిక పదుకొణె నటించిన కాక్‌టెయిల్ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది.
ఇందులో దీపిక పదుకొణె పాత్రలో రష్మిక మందన్నా నటించనుంది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..