విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. అటు విజయ్, ఇటు రష్మికకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను ప్రేమించే స్టూడెంట్ క్యారెక్టర్‌లో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఈ సినిమాలో విజయ్ లెక్చరర్‌గా కనిపిస్తే.. ప్రేమ అంటూ అతడి వెంటపడే యువతి క్యారెక్టర్‌లో నటించింది ఓ చిన్నది. ఇన్నోసెంట్‌గా తన కళ్లతో హావభావాలను పలికించిన ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘సత్తిగాని రెండెకరాలు’, ‘పెళ్లికూతురు పార్టీ’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మరి ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.?
ఆమె మరెవరో కాదు అనీషా దామా..2014లో ‘వయా పాపికొండలు’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత 2017లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో చిన్న రోల్‌లో నటించింది అనీషా. ఈ సినిమా తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అర్జున్ రెడ్డి సక్సెస్‌తో అనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘గీతగోవిందం’, ‘మహర్షి’, ‘ఓ బేబీ’, ‘ఆల్ అబౌట్ మిచెల్’ లాంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది.
అనంతరం ‘పెళ్ళికూతురు పార్టీ’, ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాలు చేసినా.. ఈ భామకు వీటితో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ‘షైతాన్’ అనే వెబ్‌సిరీస్‌లో క్యామియో చేసింది అనీషా. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . క్రేజీ లుక్స్‌తో ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి