Sudha Kongara Prasad: సూర్యతో పాన్ ఇండియా మూవీ… అసలెవరీ సుధా కొంగర
దర్శకురాలిగా చేసింది తక్కువ సినిమాలే అయినా.... దాదాపు 20 ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నారు సుధా. 2002లో ఓ ఇంగ్లీష్ సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పరిచయమైన ఈమె... తరువాత 2008లో ఆంధ్రా అందగాడు అనే తెలుగు సినిమాతో దర్శకురాలిగా మారారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో దర్శకురాలిగా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేశారు సుధా కొంగర. భారీ బడ్జెట్‌తో బిగ్ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు సౌత్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్న ఆ లేడీ డైరెక్టర్ ఎవరని ఎంక్వైరీలు మొదలు పెట్టారు మూవీ లవర్స్. తెలుగు నేల నుంచి వెళ్లి ఇప్పుడు బాలీవుడ్ మూవీ డైరెక్ట్ చేస్తున్న మహిళ దర్శకురాలే సుధా కొంగర అని తెలిసి గర్వపడుతున్నారు.
దర్శకురాలిగా చేసింది తక్కువ సినిమాలే అయినా…. దాదాపు 20 ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నారు సుధా. 2002లో ఓ ఇంగ్లీష్ సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పరిచయమైన ఈమె… తరువాత 2008లో ఆంధ్రా అందగాడు అనే తెలుగు సినిమాతో దర్శకురాలిగా మారారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో దర్శకురాలిగా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆ తరువాత రెండేళ్ల విరామం తీసుకొని ద్రోహి సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధా కొంగర. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ పడింది. చాలా కాలం సినిమాలకు దూరమైన సుధా 2016లో సాలా ఖద్దూస్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మాధవన్ హీరోగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాను ఒకేసారి తమిళ్, హిందీ భాషల్లో రూపొందించి సక్సెస్ సాధించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో సుధా కొంగరకు నేషనల్ లెవల్‌లో గుర్తింపు వచ్చింది.
సాలా ఖద్దూస్‌ను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసి మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సుధా. అదే జోరులో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ యాంథాలజీ సెగ్మెంట్‌ను కూడా డైరెక్ట్ చేసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. వరుస సక్సెస్‌లు వచ్చినా హరీబరీగా సినిమాలు చేసేయాలనుకోలేదు సుధా కొంగర. మరోసారి మూడేళ్ల విరామం తీసుకొని సూర్య హీరోగా సూరరై పోట్రు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజిటల్ రిలీజే అయినా నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు సుధా. ఈప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ పెట్టారు. మరోసారి సూర్య హీరోగా ఓ భారీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..