పై ఫొటోలో శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీ. చిన్నప్పుడు శ్రీకృష్ణుడి గెటప్ వేశాడు కదా.. పెద్దయ్యాక ఏ స్టార్ హీరో లేదా స్టార్ యాక్టర్ అయి ఉంటాడులే అనుకునేరు. కానీ అతను హీరో కాదు అంతకు మించి.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా ..అదేనండీ డైరెక్టర్. పై ఫొటోలో ఉన్నది కూడా ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్. తెలుగు వారే అయినప్పటికీ అతని కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. పాన్ ఇండియా సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ ఏర్పరచుకున్నారాయన. ఇతని సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను సైతం అవలీలగా రాబడతాయి. కెరీర్ లో ఒక్క పరాజయం కూడా లేని ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది యస్.. ఆ కృష్ణుడి గెటప్ లో ఉన్నది మరెవరో కాదు దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. ఇది అతని చిన్ననాటి ఫొటో. రాజమౌళి దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకు ఫ్లాప్ కాలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు. ఇక రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ అని అందరూ అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు.
రాజమౌళి దర్శకత్వ రంగంలోకి ప్రవేశించడానికి చాలా సంవత్సరాల ముందే ‘పిల్లన గ్రోవి’ అనే సినిమాలో నటించాడు. అప్పుడు అతని వయసు 12-13 ఏళ్లే. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. కానీ ఆ సినిమా పూర్తి కాలేదు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. దీంతో ఆ సినిమా వీళ్లకు చాలా నష్టాలనే మిగిల్చింది. ఇదే విషయాన్ని ఇటీవల రిలీజైన రాజమౌళి డాక్యుమెంటరీ మోడ్రన్ మాస్టర్స్ లో చూపించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దర్శక ధీరుడి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి చిన్నప్పుడు ఒక సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించినట్లు తెలిపారు. ఈ ఫొటోను కూడా డాక్యుమెంటరీ లో చూపించారు. దీంతో ఆ ఫోటో ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Perfectionist. Visionary. Storyteller. Watch Modern Masters: S. S. Rajamouli now, only on Netflix!#ModernMastersOnNetflix pic.twitter.com/QcVEhroijg
— Netflix India South (@Netflix_INSouth) August 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.