AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. అమరులైన సైనికుల కుటుంబాలకు నాగబాబు ఏం చేశారో తెలుసా?

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ కు తోడుగా ఉంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన ఒక మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు నాగ బాబు. దీంతో అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మెగా బ్రదర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Nagababu: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. అమరులైన సైనికుల కుటుంబాలకు నాగబాబు ఏం చేశారో తెలుసా?
Nagababu
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 4:45 PM

Share

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ కు తోడుగా ఉంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన ఒక మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు నాగ బాబు. దీంతో అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మెగా బ్రదర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నాగ బాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అందులో పనిచేస్తున్న సైనికులకు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. అదేంటంటే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ అమరులైన సైనికుల కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు మెగా బ్రదర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడిన వీడియోని, అలాగే తాను డొనేట్ చేసిన డబ్బులకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్షాక్షన్‌ వివరాలను ట్విట్టర్ లో షేర్ చేసిన నాగబాబు..

‘ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల రూపాయల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాలా అదృష్టంగా ఉందని తెలియజేయడానికి’ అని ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మెగా బ్రదర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..