
ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెట్టింట ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దాదాపు 8.6 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్, కూతురు అర్హ, కుమారుడు అయాన్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. అలాగే బన్నీ.. ఫ్యామిలీతో కలిసున్న ఫోటోస్ ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అలాగే పలు సందర్భాల్లో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. తాజాగా ఇన్ స్టా ఫాలోవర్లతో ముచ్చటించ్చారు స్నేహ. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది తను తీసుకోబోయే నిర్ణయం గురించి కూడా చెప్పేశారు.
రాబోయే ఏడాదిలో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా ? అని ఓ అభిమాని అడగ్గా.. స్నేహ స్పందిస్తూ.. అవాన్ తో కలిసి కిచెన్ బాగా వంట చేయాలనుకుంటున్నాను అంటూ బదులిచ్చింది. అలాగే తన ఫేవరెట్ ఫుడ్ ఏంటీ అని అడగ్గా.. బిర్యానీ ఫోటో షేర్ చేస్తూ ఇండియన్ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపారు. వేకువజాము వేళలు తనకు చాలా ఇష్టమని.. అలాగే తన భర్త అల్లు అర్జున్ తనను క్యూటీ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
Allu Sneha
ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గతంలో డైరెక్టర్ సుకుమార్ , బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రానికి సిక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా రాబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.