
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ సపరేట్ క్రేజ్ ను ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు సీనియర్ హీరో శ్రీకాంత్. ఒకానొక సమయంలో శ్రీకాంత్ సినిమాలకుమంచి డిమాండ్ ఉండేది.. ఆయన నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునేవి. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీకాంత్ ఆతర్వాత హీరోగా మారాడు. హీరోగా మంచి సక్సెస్ చూశాడు శ్రీకాంత్ ఇక ఇప్పుడు ఆయన సహాయక పాత్రల్లో ఆకట్టుకుంటున్నాడు. అలాగే విలన్ గాను మెప్పించారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. ఇటీవలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే శ్రీకాంత్ కు లవర్ గా వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?
శ్రీకాంత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. కాగా శ్రీకాంత్ కు లవర్ గా , వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? కొంతమంది హీరోయిన్స్ ఓ హీరోకు లవర్ గా వదినగా డిమాండ్ చేస్తే అమ్మ పాత్రలు కూడా చేస్తుంటారు. అలాగే శ్రీకాంత్ సరసన ఓ హీరోయిన్ లవర్ గా చేసింది అలాగే వదినగా కూడా చేసింది ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ సోనాలి బింద్రే.. అవును సోనాలి శ్రీకాంత్ కు లవర్ గా వదినగా నటించింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే శ్రీకాంత్ కు లవర్ గా నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఖడ్గం సినిమాలో నువ్వు నువ్వు సాంగ్ చాలా ఫెమస్.. ఈ సాంగ్ లో శ్రీకాంత్, సోనాలి కెమిస్ట్రీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా కనిపించాడు శ్రీకాంత్. అయితే ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా సోనాలి బింద్రే నటించింది. ఖడ్గం సినిమా 2002లో విడుదల కాగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా 2004లో విడుదలైంది. ప్రస్తుతం సోనాలి బింద్రే సినిమాలకు దూరంగా ఉంటుంది. మరో హీరోయిన్ స్నేహ కూడా శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించింది. రాధా గోపాళం సినిమాలో శ్రీకాంత్ , స్నేహ హీరో హీరోయిన్స్ గా నటించారు.. కాగా సంక్రాంతి సినిమాలో వెంకటేష్ భార్యగా స్నేహ నటించగా.. వెంకీ తమ్ముడిగా శ్రీకాంత్ నటించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి