Actress Urvashi: నటి ఊర్వశి ఇద్దరు చెల్లెళ్లు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్స్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఊర్వశి. ఈతరం సినీప్రియులకు ఆమె తల్లి, అత్త పాత్రలతో సుపరిచితం. ప్రస్తుతం యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా, బామ్మగా కనిపిస్తూ వెండితెరపై తనదైన నటనతో అలరిస్తుంది. కానీ మీకు తెలుసా.. ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్స్.

Actress Urvashi: నటి ఊర్వశి ఇద్దరు చెల్లెళ్లు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్స్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Urvashi

Updated on: Jun 26, 2025 | 10:08 AM

నటి ఊర్వశి.. దక్షిణాది సినీపరిశ్రమలో పెద్దగా పరిచయం అవసరంలేని నటి. ఒకప్పుడు హీరోయిన్‏గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఊర్వశి..ఆ తర్వాత వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటుంది. ఇప్పుడు సినిమాల్లో అత్త, తల్లి పాత్రలు పోషిస్తుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల జోడిగా కనిపించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. అయితే మీకు తెలుసా.. ? ఆమె ఇద్దరు చెల్లెళ్లు సైతం ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటీమణులే. ఒకప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లుగానూ రాణించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు.. ? ఇప్పుడేం చేస్తున్నారో తెలుసుకుందామా.

ఊర్వశి వ్యక్తిగత జీవితం…

కేరళలోని కొల్లం జిల్లాలో జన్మించింది ఊర్వశి. ఆమె అసలు పేరు కవితా రంజని. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. బాలనటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఊర్వశి.. అతి తక్కువ సమయంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కథానాయికగానూ రాణించింది. అనతికాలంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఊర్వశి తెలుగులోనూ హీరోయిన్ గా కనిపించింది. 1984లో మెగాస్టార్ చిరంజీవి సరసన రుస్తుం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది బాలకృష్ణ జోడిగా భలే తమ్ముడు చిత్రంలో కనిపించింది. అలాగే 1987లో న్యూఢిల్లీ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో ఈ చిత్రానికి గానూ ఉత్తమ సహయ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత వయసుకు తగినట్లుగా సహయ పాత్రలు పోషించింది ఊర్వశి..

ఊర్వశి వైవాహిక జీవితం..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే మద్యపాన వ్యసనానికి లోనయ్యారు. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. నటనపై దృష్టి పెట్టకపోవడంతో కెరీర్ దెబ్బతింది. 2000లో ఊర్వశి నటుడు మనోజ్ కె. జయన్ను ను వివాహం చేసుకున్నారు. వీరికి తేజలక్ష్మి అనే కూతురు జన్మించింది. కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016లో 44 ఏళ్ల వయసులో ఊర్వశి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇహాన్ ప్రజాపతి అనే కుమారుడు ఉన్నారు.

ఊర్వశి చెల్లెళ్లు..

ఇక ఊర్వశి ఇద్దరు చెల్లెళ్లు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్లే. వారిద్దరి పేర్లు కళారంజనీ, కల్పన. తెలుగులో మూడు , నాలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కళారంజనీ. సీనయిర్ ఎన్టీఆర్, బాలయ్య ప్రధాన పాత్రలలో నటించిన సింహం నవ్వింది చిత్రంలో కథానాయికగా నటించింది. ఇక కల్పన సైతం తెలుగువారికి సుపరిచితమే. కార్తీ, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఊపిరి చిత్రంలో ఆయా పాత్రలో కనిపించింది కల్పన. అలాగే నాగ చైతన్య నటించిన మజిలీ చిత్రంలోనూ కనిపిస్తుంది.

Urvashi, Kalaranjani, Kalpana

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..