AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: అతిలోక సుందరి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.. శ్రీదేవితోనే గొడవపడి కేసు కూడా వేసింది ఆమె

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శ్రీదేవి. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, శోభన్ బాబులాంటి హీరోలతో నటించిన శ్రీదేవి ఆతర్వాత జనరేషన్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, నాగార్జునలతో కూడా సినిమాలు చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి అన్ని ఏరియాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Sridevi: అతిలోక సుందరి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.. శ్రీదేవితోనే గొడవపడి కేసు కూడా వేసింది ఆమె
Sridevi
Rajeev Rayala
|

Updated on: May 09, 2024 | 10:48 AM

Share

అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమో.. ఆమె అందం, ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది శ్రీదేవి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శ్రీదేవి. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, శోభన్ బాబులాంటి హీరోలతో నటించిన శ్రీదేవి ఆతర్వాత జనరేషన్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, నాగార్జునలతో కూడా సినిమాలు చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి అన్ని ఏరియాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బోని కపూర్ కు ఇది రెండో వివాహం. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే శ్రీదేవి అకస్మాత్ మరణం ఆమె అభిమానులను, ఇండస్ట్రీని తీవ్ర విషాదం లోకి నెట్టింది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించారు. ఇది అందరికి తెలిసిందే.. ఇదిలా ఉంటే పై ఫొటోలో శ్రీదేవితో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.? శ్రీదేవితో పెద్ద గొడవ పెట్టుకొని కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

ఆమె ఎవరో కాదు శ్రీదేవి సొంత సోదరి. అవును చాలా మందికి తెలియకపోవచ్చు.. శ్రీదేవికి సోదరి ఉంది ఆమె పేరు శ్రీలత. శ్రీదేవిలాంటి అందంగా చూడచక్కని రూపంతో ఉంటుంది ఈ శ్రీలత. అయితే శ్రీదేవి తల్లి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.. అయితే ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే శ్రీదేవి తల్లి మరణించారు. దీని పై అప్పట్లో శ్రీదేవి , శ్రీలత కోర్టులో కేసు వేశారు. ఇందుకు పరిహారంగా పరిహారంగా రూ. 7.2 కోట్లు వచ్చాయి. అయితే దీనిలో తనకు వాటా ఇవ్వాలని శ్రీలత శ్రీదేవితో గొడవ పట్టుకున్నారు. దాంతో వీరి  పెరిగింది. ఆతర్వాత శ్రీలత కోర్టు మెట్లెక్కింది. సొంత అక్క అయిన శ్రీదేవి పై కోర్టులో కేసు వేసి గెలిచింది శ్రీలత. చివరకు తనకు రావాల్సిన 2 కోట్లు తీసుకుంది. దాంతో వీరి బంధం తెగిపోయింది. ఆతర్వాత శ్రీదేవి చనిపోయిన తర్వాత శ్రీలత చివరి చూపుకు నోచుకోలేదని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us