Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావ్ హైదరీ మాజీ భర్త ఎవరో తెలుసా ?.. ఆ క్రికెటర్ కూతురిని పెళ్లి చేసుకున్నాడా ?..
టాలీవుడ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధిచిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. వీరిద్దరి ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. అయితే అదితి మొదటి వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆమె నటిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే ఆమె వైవాహిక బంధం ముగిసింది.
టాలీవుడ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధిచిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. వీరిద్దరి ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. అయితే అదితి మొదటి వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆమె నటిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే ఆమె వైవాహిక బంధం ముగిసింది. అదితి విడాకుల తర్వాతే నటిగా సినిమాల్లోకి వచ్చిందని అంటుంటారు. ఇక ఆమె మాజీ భర్తకు సంబంధించిన వివరాలు కూడా అంతగా తెలియవు. కానీ ఇప్పుడు అదితి, సిద్ధార్థ్ పెళ్లి చేసుకోవడంతో వీరి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. అదితి భర్త గతేడాది పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అతడి పేరు సత్యదీప్ మిశ్రా.
వెస్టిండీస్ మాజీ క్రికెట్ర వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను గతేడాది వివాహం చేసుకున్నారు సత్యదీప్ మిశ్రా. మసాబా బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కూడా. సత్యదీప్ లాగే మసాబాకు కూడా ఇది రెండో పెళ్లి. అంతకు ముందు ఆమె నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకుంది. సత్యదీప్, మసాబా ఇద్దరూ నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మసాబా మసాబా లో కనిపించారు. సత్యదీప్ ముంబైలో నటనా వృత్తిని ప్రారంభించే ముందు న్యాయవాదిగా పనిచేశాడు. అతను బాంబే వెల్వెట్, నో వన్ కిల్డ్ జెస్సికా, ఫోబియా, విక్రమ్ వేద వంటి చిత్రాలలో నటించాడు.
అదితిలాగే సిద్ధార్థ్ మొదటి పెళ్లి కూడా విఫలమైంది. 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2007లో వీరు విడాకులు తీసుకున్నారు. 2021లో మహాసముద్రం సినిమాలో అదితి, సిద్ధార్థ్ కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడినట్లుగా సమాచారం. గత ఏడాది అదితి 36వ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్న ప్రత్యేక చిత్రాన్ని పోస్ట్ చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో అదితి, సిద్ధార్థ్‌ల వివాహం జరిగినట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.