స్టార్ హీరోల మేనేజర్ ఆత్మహత్య…కలకలం
బాలీవుడ్ హీరోలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మల మాజీ మేనేజర్ దిశా శాలిన్.. సూసైడ్ చేసుకుంది. మంగళవారం, ముంబయిలో తాను ఉంటున్న అపార్ట్మెంట్ 14వ ప్లోర్ నుంచి ఆమె కిందకు దూకింది. వెంటనే దగ్గర్లో ఉన్న బోరివాలీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

బాలీవుడ్ హీరోలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మల మాజీ మేనేజర్ దిశా శాలిన్.. సూసైడ్ చేసుకుంది. మంగళవారం, ముంబయిలో తాను ఉంటున్న అపార్ట్మెంట్ 14వ ప్లోర్ నుంచి ఆమె కిందకు దూకింది. వెంటనే దగ్గర్లో ఉన్న బోరివాలీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా దిశా మరణంపై హీరోలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ఈమె.. ప్రముఖ కయెడియన్స్ కపిల్ శర్మ, వరుణ్ గ్రోవర్‌లకు కూడా మేనేజర్‌గా వర్క్ చేసింది.
అందుతోన్న సమాచారం ప్రకారం, దిశా నిన్న సాయంత్రం తన కాబోయే భర్త రోహన్ రాయ్‌తో కలిసి మలాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దిశా తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె కాబోయే భర్త కూడా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. దిశా పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా తన వృత్తిని ప్రారంభించి.. అనతికాలంలోనే సెలబ్రిటీ టాలెంట్ మేనేజర్‌గా మారింది. ఆమె ప్రస్తుతం బంటీ సజ్దేహ్ యొక్క టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కార్నర్‌స్టోన్‌లో ఉద్యోగం చేస్తుంది.
