10 Days Love: డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా 10డేస్ లవ్ ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్..

|

Feb 11, 2022 | 3:19 PM

మనోజ్ పుట్టుర్ (Manoj Puttur ), చాందిని భగవాని (Chandini Bhagavani) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం 10 డేస్ లవ్ (10Days Love ).

10 Days Love: డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా 10డేస్ లవ్ ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్..
10 Days Love
Follow us on

మనోజ్ పుట్టుర్ (Manoj Puttur ), చాందిని భగవాని (Chandini Bhagavani) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం 10 డేస్ లవ్ (10Days Love ). ఈ సినిమాను అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు. డి నిర్మిస్తుండగా.. నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ని తాజాగా డైరెక్టర్ వి. వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. వివి వినాయక్ మాట్లాడుతూ.. ‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.

అలాగే.. దర్శకుడు నాగరాజ్ బోడెమ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వినాయక్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరికో ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు. మా టీమ్‌ని ఆశీర్వదించి, సినిమా సక్సెస్ కావాలని కోరిన వినాయక్‌గారికి ఈ సందర్భంగా మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇది ప్యూర్ లవ్ స్టోరి. చిత్రీకరణ అంతా బాగా జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు. హీరో మనోజ్ పుట్టుర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే మా చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి, ఆశీర్వదించిన దర్శకులు వినాయక్ గారికి ధన్యవాదాలు..’’ అని తెలపగా హీరోయిన్ చాందిని భగవానిని మాట్లాడుతూ ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మాత హరిబాబు. డి మాట్లాడుతూ.. ‘‘మేము అడగగానే మరో ఆలోచన చేయకుండా.. మా చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన దర్శకులు వివి వినాయక్‌గారికి కృతజ్ఞతలు. దర్శకుడు నాగరాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ముందు ముందు మంచి దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ‘14 డేస్ లవ్’ మూవీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంది. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్నదే మా బ్యానర్ లక్ష్యం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..