ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్లలో వివేక్ ఆత్రేయ ఒకరు. మెంటల్ మదిలో… బ్రోచేవారెవరురా.. అంటే సుందరానికీ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైందని.. సెలబ్రెటీలపై కావాలనే విమర్శలు చేస్తున్నారని.. సెలబ్రెటీలందరూ నెట్టింటికి దూరంగా ఉంటే ఇలాంటివి తగ్గుతాయని అన్నారు వివేక్. అలాగే తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. తన ఫోన్ నంబరును హీరోయిన్ అనుష్క నంబర్ అనుకుని ఎంతోమంది కాల్స్, మేసెజ్, వీడియో కాల్స్ చేశారని అన్నారు.
కరోనా సమయంలో తన స్నేహితుడి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సరిపడ బ్లడ్ గ్రూప్ కోసం ఎంతో వెతికామని.. తన ఫోన్ నంబర్ జత చేస్తూ అందరికీ మేసేజ్ లు పంపినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ అనుష్క.. మాకు సాయం చేయడం కోసం నేను పంపిన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆమెదే అనుకుని చాలా మంది కాల్స్ చేశారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ ఊహించి ఉండరు.. కొందరు వీడియో కాల్స్ చేస్తే.. మరికొందరు షర్ట్ లేకుండా ఫోటోస్ పంపారు. ఆ దారుణాలను చెప్పలేను. హీరోయన్స్ జీవితం ఇంత కష్టంగా ఉంటుందా అని ఆరోజు షాకయ్యాను. కొద్దిరోజులకే ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసాను అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఇటీవల నాని నటించిన అంటే.. సుందరానికీ సినిమాకు వచ్చిన ఫలితానికి పూర్తి బాధ్యత తనదే అని అన్నారు. ఆ సినిమా చూసి కొందరు నచ్చిందంటే.. మరికొందరు నిడివి ఎక్కువ ఉందంటూ కామెంట్స్ చేశారని.. నిడివి తగ్గేంచేందుకు ట్రై చేసినా.. కుదరలేదని.. సినిమాకు ఎక్కువ దగ్గర కాకూడదని ఈ సినిమా నుంచే నేర్చుకున్నాని.. ఈ సినిమా ఫలితం చాలా బాధపెట్టిందని అన్నారు.