AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్ కామెంట్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ తో చిత్రం, నువ్వునేను, నితిన్ తో జయం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ కు అందించాడు తేజ.

నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్ కామెంట్స్
Teja
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 2:58 PM

Share

మనిషి పుట్టుక ఒక నిర్దిష్ట కార్యం కోసమే అని, ఆ కార్యసాధనకే జీవితం అంకితమైందని దర్శకుడు తేజ అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధానం, మానవ బలహీనతలను వివరించారు. తన జీవితంలో ఎదురైన ఒక కీలక సందర్భాన్ని ఉదాహరణగా చెప్తూ, నిత్యానంద స్వామితో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. తన కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అది మరింత సీరియస్ గా మారింది. ఈ సమయంలో ఎవరో ఓ వ్యక్తి నిత్యానంద స్వామి బాబు ఆరోగ్యాన్ని సెట్ చేస్తారని, అతను తగ్గిస్తాడని, అయితే లక్ష రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చి చూస్తారని సలహా ఇచ్చాడట. కుమారుడి ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనతో, సాధారణంగా ఇలాంటి విషయాలను నమ్మకపోయినా, ఆ క్షణంలో వేరే మార్గం లేకపోవడంతో నిత్యానంద ట్రస్ట్‌కు లక్ష రూపాయల చెక్ ఇచ్చారట తేజ.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

ఆతర్వాత నిత్యానంద ఇంటికి వచ్చి తేజ కొడుకును చూశారు. ఇంట్లో ఉన్న పనమ్మాయి సైతం ఆయన కాళ్ళ మీద పడిపోవడం చేస్తుందట, తేజ దూరం నుంచి వాటన్నిటినీ గమనిస్తున్నారట. నిత్యానంద వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఆ చెక్ బౌన్స్ అయింది. ఇది తెలిసి తేజ భార్య ఆయనను తిట్టిందట.. ఒక చెక్కు ఇవ్వబోయి మరో  చెక్ ఇచ్చి ఉంటా.. అని మరో చెక్ ఇచ్చారట.. కొన్నిరోజుల తర్వాత అది కూడా బౌన్స్ అయింది. అకౌంట్ లో డబ్బులు లేవేమో అని ఈసారి డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయడానికి వెళ్తుండగా, ఫోన్ లో మెసేజ్ వచ్చింది. దాంట్లో నిత్యానందపై వచ్చిన వార్తలు చూసి షాక్‌కు గురయ్యారట తేజ. నిత్యానంద వివాదాల్లో చిక్కుకున్నాడని, అతడు దొరికాడని వార్తలు రావడంతో ఆయన వెనక్కి వచ్చేశారట. కష్టార్జితం కాబట్టి ఆ డబ్బులు దక్కాయని, లేకపోతే పోయేవని ఆయన భావించారట.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఈ సంఘటన మనిషి జీవితంలో సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవనే వాస్తవాన్ని తేజ అన్నారు. వసుదేవుడు కూడా గాడిద కాళ్లను పట్టుకున్నాడని చెప్పినట్లు, మనిషి అవసరం అయితే ఎవరి కాళ్ళనైనా పట్టుకుంటాడు, మతాలను కూడా మార్చుకుంటాడు అని ఆయన అన్నారు. మన చేతిలో లేని సమస్యలను ఎదుర్కొనేటప్పుడు తెలివైనవారు, తెలివి తక్కువవారు అనే భేదం ఉండదని, అందరూ పరిష్కారం కోసమే చూస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ అనుభవం ద్వారా జీవితంలో వచ్చే సమస్యలను మరింత ప్రశాంతంగా ఎదుర్కోవచ్చని ఒక గుణపాఠం నేర్చుకున్నానని దర్శకుడు తేజ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..