Breaking : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు.
Sekhar Kammula Father Death : ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో శేఖర్ కమ్ముల తండ్రిగారి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల శేఖర్ కమ్ములను ఫోన్ లో పరామర్మించారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. చివరి దశకు వచ్చిన ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా కరోనా కష్టకాలంలో పలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు శేఖర్ కమ్ముల.
Read More : ఆగస్టు నెలలో స్థిరంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు : తాజా రేట్లు ఇలా