
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో సినీరంగంలో సంచలనం సృష్టించారు. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఇక ఇటీవల యానిమల్ మూవీతో రికార్డ్స్ కొల్లగొట్టారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత సందీప్ తెరకెక్కించనున్న ప్రాజెక్ట్స్ పై విపరీతమైన హైప్ నెలకొంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందించే పనిలో ఉన్నారు. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. తాజాగా జగపతి బాబు హోస్టింగ్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ టాక్ షోలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. “రామ్ గోపాల్ వర్మ ఎన్నో విషయాల్లో నాకు గురువు. ఆయన చిత్రాలు చూసి తెలియని విషయాలు తెలుసుకున్నాను. సత్య సినిమాను 60 సార్లు చూశాను. ఆ మూవీ చూసే ఎడిటింగ్ నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
అలాగే ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో బాహుబలి 2 ఇంటర్వెల్ హైలెట్. ఆ సినిమాకు మించిన ఇంటర్వెల్ సీన్ ఇప్పటివరకు లేదు. అది చూసి నా స్టూడియోకు వచ్చి అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ చూశాను. ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని భయం వేసింది. ఇంటర్వెల్ సీన్ సైతం గొప్పగా ఉండాలని రాజమౌళి నిరూపించారు అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..