Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా.. ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాపై డైరెక్టర్ సందీప్ కామెంట్స్..

ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా రానుందని గతంలోనే డైరెక్టర్ సందీప్ వెల్లడించారు. కానీ ప్రస్తుతం అతడు స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో తాను నిర్మించబోయే సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు వసూలు చేయ్యోచ్చు అన్నారు.

Sandeep Reddy Vanga: 'స్పిరిట్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా.. ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాపై డైరెక్టర్ సందీప్ కామెంట్స్..
Prabhas, Sandeep Reddy Vanga
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: May 11, 2024 | 3:39 PM

గతేడాది యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ సెలబ్రెటీస్, క్రిటిక్స్ ఈ మూవీపై విమర్శలు వచ్చినా.. అడియన్స్ మాత్రం అద్భుతమైన విజయాన్ని అందించారు. రణబీర్ కెరీర్‍లోనే అతిపెద్ద విజయాన్ని సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా రానుందని గతంలోనే డైరెక్టర్ సందీప్ వెల్లడించారు. కానీ ప్రస్తుతం అతడు స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో తాను నిర్మించబోయే సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు వసూలు చేయ్యోచ్చు అన్నారు.

ప్రస్తుతం తాను స్పిరిట్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నానని, నవంబర్ లేదా డిసెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉందని అన్నారు. సౌత్ మూవీస్ బడ్జెట్ 300 కోట్లు ఉంటుందని సదరు యాంకర్ ప్రశ్నించగా.. సందీప్ మాట్లాడుతూ.. “అది స్టార్ క్రేజ్ పై ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ గారికి ఇది సరైన బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. స్పిరిట్ డబ్బును రికవరీ చేస్తుందని అనుకుంటున్నారు. ప్రభాస్, నా కాంబోలో వచ్చే సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కులను కలిపి నిర్మాత అంత పెద్ద మొత్తంలో అమౌంట్ రికవరీ చేస్తారు. టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ సవ్యంగా సాగితే… ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఏం చేసినా, అన్నీ కుదిరితే సినిమా తొలిరోజే రూ.150 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది ట్రేడ్ లెక్క. సులువుగా రూ. 150 కోట్లు రాబట్టే అవకాశాలు లేకపోలేదు” అని అన్నారు.

ఈ సందర్భంగా ప్రభాస్‌తో గత చిత్రాలకు నో చెప్పడంపై కూడా ఓపెన్‌గా మాట్లాడాడు. ‘యానిమల్‌’ కంటే ముందే ప్రభాస్‌తో హాలీవుడ్‌ రీమేక్‌కి దర్శకత్వం వహించే ఆఫర్‌ వచ్చిందని అన్నారు. కబీర్ సినిమా కంటే ముందే స్పిరిట్ చేయాలని అనుకున్నామని.. కానీ కొన్ని కారణాలతో ఆగిపోయిందని అన్నారు. ఆ తర్వాత స్పిరిట్ మూవీతో ప్రభాస్ ను సంప్రదించామని అన్నారు. ఈ యాక్షన్-థ్రిల్లర్ షూటింగ్ నవంబర్-డిసెంబర్ 2024 నుండి ప్రారంభం కానుందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.