AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra: ప్రభాస్ స్టార్‌డమ్ చూసి షాకయ్యా.. హీరో నవీన్ చంద్ర ఇంట్రస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు. అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్నాడు. అయితే హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Naveen Chandra: ప్రభాస్ స్టార్‌డమ్ చూసి షాకయ్యా.. హీరో నవీన్ చంద్ర ఇంట్రస్టింగ్ కామెంట్స్
Naveen Chandra
Balu Jajala
|

Updated on: Apr 10, 2024 | 6:14 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్నారు. అయితే ఈ హీరో ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్నాడు. అయితే హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా సినిమాల్లో తిరుగులేని స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ తెలుగు సినిమా హీరోల్లో ఒకడిగా నిలుస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ డమ్ దిశగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి సినిమాతో పాపులారిటీ పెరిగిపోతోంది.

ఇటీవల టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర.. ప్రభాస్ కెరీర్ లో సంచలన విజయం సాధించిన “వర్షం” సినిమా సందర్భంగా ప్రభాస్ కు ఉన్న విపరీతమైన క్రేజ్ చూసి షాక్ అయ్యానని రివీల్ చేశాడు. ‘ఇన్సెపెక్టర్ రిషి’ సీరిస్ లో నటించిన నవీన్ చంద్ర ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ లో మరిచిపోలేని ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. భీమవరంలో 50 రోజుల పాటు జరిగిన ‘వర్షం’ కార్యక్రమానికి హాజరై ఓ పాట పాడానని అన్నారు. అప్పట్లో ఆయన చేతిలో కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నప్పటికీ అభిమానులు బాగానే సంపాదించుకున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే ప్రభాస్ పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోందని నవీన్ చంద్ర అన్నారు.

కాగా స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్  చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం మనం చూశాం. తాజాగా ఈ జాబితాలోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ చేరాడు. కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు గౌడ్ సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హాజరైన సుకుమార్ టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..