Prabhas: బాలయ్య షోలో ప్రభాస్ మూవీ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి.. ఫ్యాన్స్ కు పూనకాలే
ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా రికార్డ్ క్రియేట్ చేసింది బాలయ్య అన్ స్టాపబుల్. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్ పూర్తిచేసుకున్న బాలయ్య షో.. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ తో సీజన్ 3 లోకి అడుగు పెట్టింది. సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కు బాలయ్య లేటెస్ట్ సూపర్ హిట్ భగవంత్ కేసరి మూవీ టీమ్ హాజరయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ శ్రీలీల, కాజల్ తో బాలయ్య సందడి చేశారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ టాక్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా రికార్డ్ క్రియేట్ చేసింది బాలయ్య అన్ స్టాపబుల్. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్ పూర్తిచేసుకున్న బాలయ్య షో.. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ తో సీజన్ 3 లోకి అడుగు పెట్టింది. సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కు బాలయ్య లేటెస్ట్ సూపర్ హిట్ భగవంత్ కేసరి మూవీ టీమ్ హాజరయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ శ్రీలీల, కాజల్ తో బాలయ్య సందడి చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హాజరయ్యాడు. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రణబీర్ కపూర్, రష్మిక , దర్శకుడు సందీప్ రెడ్డి హాజరయ్యారు.
యానిమల్ టీమ్ తో బాలకృష్ణ సందడి చేశారు. తనదైన స్టైల్ లో గెస్ట్ లను ఆటపట్టించారు బాలయ్య. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో తాను చేయనున్న స్పిరిట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా బాలయ్య షోలో సందీప్ మాట్లాడుతూ .. స్పిరిట్ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నా అని క్లారిటీ ఇచ్చాడు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయ్ దాంతో ఇప్పుడు చేస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే స్పిరిట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సందీప్ రెడ్డి ప్రభాస్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
“I Would Like To Be #Prabhas‘ close Friend And I am also a Big Fan of Him”
“#SandeepReddyVanga‘s Next Film is with #Prabhas Anna, If he has a Small Role for me I would love to be part of #Spirit 🔥”
~#RanbirKapoor During #AnimalTheFilm Promotions❤️🔥 #AnimalTrailer pic.twitter.com/m6K75BK89e
— Prabhas FC (@PrabhasRaju) November 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.