Sai Rajesh: త్రివిక్రమ్ సంపాదనపై నెటిజన్ ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..

త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas).. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. సినీ ప్రియులు ఆయనను మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు.

Sai Rajesh: త్రివిక్రమ్ సంపాదనపై నెటిజన్ ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..
Trivikram

Updated on: Mar 15, 2022 | 6:53 AM

త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas).. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. సినీ ప్రియులు ఆయనను మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు. నిజమే.. త్రివిక్రమ్ డైలాగ్స్ అంతలా ప్రేక్షకుల మనసును తాకుతుంటాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ ఎంతగా జనాలల్లో పాతుకుపోతాయో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నెట్టింట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రదాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురం సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. కానీ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందించాడు.

ఈ సినిమా మొదటి నుంచి త్రివిక్రమ్ పేరు వినిపిస్తూనే ఉంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం మూవీని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంలో త్రివిక్రమ్ కీలకపాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. ఇక పవన్ కోసం మరో రీమేక్ కథను కూడా సిద్ధం చేశాడట. అలా దాదాపు మూడు సినిమాలను కథనాన్ని అందించాడు.. ఈ మూడు చిత్రాలకు కలిపి త్రివిక్రమ్ దాదాపు నలభై నుంచి యాభై కోట్లు అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఏమాత్రం కష్టపడకుండా ఇలా మాటలు రాసేసి కోట్లు తీసుకుంటున్నాడు. సెట్ లో లుంగీ కట్టుకుని తిరుగుతూ రీమేక్ స్టోరీకి పది సార్లు నా కొడక.. నా కొడక అని డైలాగ్స్ యాడ్ చేసి ఇన్ని కోట్లు జేబులో ఏస్కున్నాడు ఇది రా లైఫ్ అంటే అని ఓ నెటిజన్ సెటైర్లు వేశాడు. దీనిపై హృదయ కాలేయం ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించాడు. రూ.1500లకు రూమ్ షేరింగ్ స్థాయి నుంచి యాభైకి పైగా సినిమాలకు ఘెస్ట్ రైటర్‏గా పనిచేసి.. మొదటి హిట్ కొట్టేందుకు పదేళ్లు కష్టపడ్డాడు.. ఏదీ ఊరికే రాదు అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు