Rakshasudu 2: మరోసారి భయపెట్టేందుకు వస్తోన్న రాక్షసుడు.. బెల్లంకొండను రీప్లేస్‌ చేయనున్న అగ్ర హీరో.

|

Jul 13, 2021 | 1:39 PM

Rakshasudu 2: బెల్లం కొండ శ్రీను హీరోగా వచ్చిన 'రాక్షసుడు' సినిమా తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. తమిళంలో 2018లో వచ్చిన 'రాట్సనన్‌' చిత్రానికి రీమేక్‌గా వచ్చిన సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ...

Rakshasudu 2: మరోసారి భయపెట్టేందుకు వస్తోన్న రాక్షసుడు.. బెల్లంకొండను రీప్లేస్‌ చేయనున్న అగ్ర హీరో.
Rakshasudu 2
Follow us on

Rakshasudu 2: బెల్లంకొండ శ్రీను హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. తమిళంలో 2018లో వచ్చిన ‘రాట్సనన్‌’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఊపిరి పీల్చుకోవని సస్పెన్స్‌తో కూడిన కథ, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్‌మెంట్‌తో సాగే కథనం సినీ లవర్స్‌ను ఫిదా చేసింది. 2019లో తెలుగులో విడుదలైన ఈ సినిమాలో బెల్లం కొండ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్‌. గత కొన్ని రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా చిత్ర దర్శకుడు రమేష్‌ వర్మ ఈ విషయాన్ని అధికారికంగా ప్రటించారు.

‘రాక్షసుడు2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రమేష్‌ వర్మ.. ‘ఊపిరి బిగపట్టండి.. ఈసారి రెట్టింపు థ్రిల్‌ ఉంటుంది’. అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇదిలా ఉంటే టెక్నికల్‌ టీమ్‌కు సంబంధించినంత వరకు రాక్షసుడు తొలి పార్ట్‌కు పనిచేసిన వారే ఉండనున్నట్లు సమాచారం. కానీ హీరో మాత్రం మారనున్నారని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్రలో ఓ అగ్ర హీరో నటించనున్నారని టాక్‌ నడుస్తోంది. ఇంతకీ ఆ అగ్రహీరో ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక హీరోయిన్‌ కూడా మారుతుందా..? లేదా అనుపమానే ఉంటుందా వేచి చూడాలి. ప్రస్తుతం రమేష్‌ వర్మ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఖిలాడి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాక్షసుడు-2 ప్రారంభం కానుంది.

Also Read: Kadaknath Poultry : కడప జిల్లాలో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం.. ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్

Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా.. షాకైన భార్యాభర్తలు.. వీడియో వైరల్.!

Virgin Galactic-Jeff Bezos: రోదసీ యాత్రపై కొత్త వివాదం.. అంతసీన్ లేదంటున్న అమెజాన్ అధిపతి