Hanuman-RGV: హనుమాన్‌ సినిమా గురించి ట్వీట్‌ చేసిన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. ఏమన్నాడంటే?

|

Jan 13, 2024 | 1:38 PM

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ అందుకు తగ్గట్టుగానే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతున్నాడు. శుక్రవారం (జనవరి 12) విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. సూపర్‌ మ్యాన్‌ కథకు ఇతిహాసాలను ముడిపెట్టి ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాను తెరకెక్కించిన తీరు అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. కథా, కథనం, గ్రాఫిక్స్,ఎమోషన్స్,ఎలివేషన్స్ ఇలా అన్నీ అంశాల్లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Hanuman-RGV: హనుమాన్‌ సినిమా గురించి ట్వీట్‌ చేసిన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. ఏమన్నాడంటే?
Ram Gopal Varma, Hanuman Movie
Follow us on

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ అందుకు తగ్గట్టుగానే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతున్నాడు. శుక్రవారం (జనవరి 12) విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. సూపర్‌ మ్యాన్‌ కథకు ఇతిహాసాలను ముడిపెట్టి ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాను తెరకెక్కించిన తీరు అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. కథా, కథనం, గ్రాఫిక్స్,ఎమోషన్స్,ఎలివేషన్స్ ఇలా అన్నీ అంశాల్లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తేజ సజ్జా అభినయం అదిరిపోయిందంటూ ప్రశంసలు వస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హనుమాన్‌ సినిమాను చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ హనుమాన్‌ సినిమాపై ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపిన ఆర్జీవీ ‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. జై హనుమాన్’ అని రాసుకొచ్చారు. అయితే ఆయన హనుమాన్ సినిమాను చూశాడా?లేదా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా ఇతర సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు వర్మ. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్‌ పెట్టడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక టాలీవుడ్‌లో సాయి ధరమ్ తేజ్ సహా మరికొందరు హీరోలు, నటీ నటులు హనుమాన సినిమపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ వెంటనే ‘థ్యాంక్యూ సర్’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.హనుమాన్‌ మూవీలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్‌ కీలక పాత్ర పోషించింది. వినయ్‌ రాయ్‌ స్టైలిష్‌ విలన్‌గా మెప్పించాడు. రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సముద్ర ఖని, గెటప్‌ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. కాగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం కూడా జఈ జనవరి లోనే రిలీజ్‌ కావల్సాంది అయితే ఇందులో రాజకీయ పరమైన అంశాలుండడంతో తెలంగాణ హైకోర్టు వ్యూహం విడుదలపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది. మరి వ్యూహం ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

హనుమాన్ మొదటి రోజు కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.