ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే. ప్రస్తుతం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ మూవీ. మే 5న విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్నో వివాదాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబడుతుంది. ఎంతో మంది అమ్మాయిల జీవిత కథ ఇదీ అంటూ కొందరు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ మూవీని బ్యాన్ చేయాలంటున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
“తమిళ్/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే ” అంటూ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్ పై విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. 2018-19లో దాదాపు 32 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. వారు ఎక్కడున్నారు ?ఏమైపోయారు ?అని పట్టించుకునేవాళ్లు లేరు. ఆ కథనే ది కేరళ స్టోరీగా వెండితెరపైకి తీసుకువచ్చారు డైరెక్టర్ సుదీప్తోసేన్. ఇందులో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించగా.. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.
అనేక వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా..భారీగా వసూళ్లు రాబడుతుంది. ఫస్ట్ డే రూ. 8.02 కోట్లు.. సెకండ్ డే రూ. 11.22 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆదివారం ఏకంగా రూ. 16 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు దాదాపు రూ.32 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆదా శర్మ హిందూ అమ్మాయిగా కనిపించనుంది.
A Tamil/Malyali girl playing the lead , a Gujrati producer , a bengali director, a Hindi film now a BLOCKBUSTER in all languages ..A TRUE PAN INDIAN FILM #TheKeralaStory
— Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.