ఎన్టీఆర్‌లాగే పవన్‌కు వెన్నుపోటు.. ఆ ఇద్దరి విషయంలో జనసేనాని జాగ్రత్తగా ఉండాలి.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

|

Jan 28, 2023 | 9:43 PM

దివంగత ఎన్టీఆర్‌లాగే పవన్‌ కల్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఈమేరకు పవన్‌తో పాటు జన సైనికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలంటూ వరుస ట్వీట్లు చేశారు.

ఎన్టీఆర్‌లాగే పవన్‌కు వెన్నుపోటు.. ఆ ఇద్దరి విషయంలో జనసేనాని జాగ్రత్తగా ఉండాలి.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan, Rgv
Follow us on

వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ మధ్యన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎన్టీఆర్‌లాగే పవన్‌ కల్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ఈమేరకు పవన్‌తో పాటు జన సైనికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘ప్రియమైన జనసైనికులారా.. దయచేసిన మన లీడర్‌ను వెన్నుపోటు నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి. ఇంతకుముందు పవనిజం పుస్తకం రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను…. అతని విషయంలో నా మాటే నిజమైంది… జై జనసేన’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. ఇక మరొక ట్వీట్‌లో ‘ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రోటస్, ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్లు ఈసారి పవన్ కల్యాణ్ ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారు. ఈ విషయాన్ని నాకు రాత్రి కలలో దేవుడు వచ్చి చెప్పాడు’ అని జనసైనికులకు వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

కాగా గత కొన్ని రోజులుగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు వర్మ. ఇక యువశక్తి సభలో పవన్‌ ప్రసంగంపై కూడా సెటైర్లు వేశారు. అలాగే మెగా బ్రదర్‌ నాగబాబులను ఉద్దేశిస్తూ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు ఆర్జీవీ. ఆయన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో గానీ తనకు కాదన్నారు. తాను జనసేన పార్టీ మీద కానీ, పవన్ కల్యాణ్ మీద గానీ పెట్టిన ట్వీట్లు ఓ అభిమానిగా చేసినవేనన్నారు. అయితే వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టమని, తన కంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టకరమని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నాగబాబు లాంటి సలహదారులను మాత్రమే పెట్టుకుంటే దాని ఫలితాన్ని ప్రజలే చెబుతారని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..