బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వివాదాలతోనే ఎక్కువగా హైలెట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఈసారి అంతకు మించి అనేలా నెట్టింట ట్రెండ్ అవుతోంది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు శుక్రవారం (ఫిబ్రవరి 02) వార్తలు వచ్చాయి. తన మేనేజర్ స్వయంగా చెప్పడంతో ఇదంతా నిజమే అని నమ్మారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు నెట్టింట రిప్ పోస్టులు కూడా షేర్ చేశాడు. అయితే ఎప్పటిలాగే జనాలను మరోసారి పిచ్చోళ్లను చేసింది పూనమ్. తాను బతికున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. కేవలం సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని, క్షమాపణలు కోరింది. దీంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అదే సమయంలో చావును కూడా పబ్లిసిటీ స్టంట్‌కు వాడుకోవడంపై చాలామంది పూనమ్‌పై ఫైర్ అవుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పూనమ్ పాండే రచ్చపై స్పందించారు. ఏ విషయమైనా వెరైటీగా థింక్ చేసే ఆర్జీవీ పూనమ్ విషయంలోనూ అలాగే రియాక్ట్ అయ్యారు.
‘హేయ్ పూనమ్ పాండే… సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. అందులో చాలా మంచి ఉద్దేశముంది. దానినిఎవరు కాదనలేరు. దీని ద్వారా నువ్వు ప్రజల ప్రేమను పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ ప్రస్తుతం అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం నువ్వే. మార్గం ఏదైనా అనుకున్నది సాధించావు. నీ మాదిరేగానే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. నీవు సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Hey @iPoonampandey the extreme method u employed to draw attention to this issue might attract some criticism , but no one can question ur INTENT nor what u ACHIEVED with this HOAX .. Discussion on cervical cancer is TRENDING all across now 🙏🙏🙏 Your SOUL is as BEAUTIFUL as YOU…
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.