AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ‘కేసీఆర్ బయోపిక్ తీస్తా’.. మరోసారి క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. తాజాగా ఈయన తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్నట్టు ప్రకటించారు.

Ram Gopal Varma: 'కేసీఆర్ బయోపిక్ తీస్తా'.. మరోసారి క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
Rgv, Kcr
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2022 | 3:19 PM

Share

ఆర్జీవీ ఎప్పుడు..ఎలా బిహేవ్‌ చేస్తారో చెప్పడం కష్టం. రాంగోపాల్‌ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. తాజాగా ఈయన తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్నట్టు ప్రకటించారు. 2019లో కూడా టైగర్ కేసీఆర్ అంటూ ఓ బయోపిక్‌ను అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కామ్ అయిపోయారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మరోసారి సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీపై తన మనసులతో మాట బయట పెట్టారు.

ఇక పొలిటికల్ బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన తోపు దర్శకుడు లేరు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన బయోపిక్స్‌ను తీయడంలో వర్మను మించినోడు లేడంటూ ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు. గతంలో రామ్‌గోపాల్ వర్మ ఏదైనా సంఘటన జరినపుడు దానికి సంబంధించిన చరిత్రను సినిమా తీస్తున్నట్టు ప్రకటించడం ఆయన అలవాటు.అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇష్టం ఉంటే ఆ సినిమాను తెరకెక్కిస్తారు.

ఇక జనరల్‌ ఎలక్షన్ల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో సంచలనం రేపారు. ముందుగా ఈ సినిమాకు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ కులాన్ని సంబోధిస్తూ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత టైటిల్ ఛేంజ్ చేసి రిలీజ్ చేస్తే అంతగా వర్కౌట్ కాలేదు.ఇక అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. అంతేకాదు కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాకు అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ‘ఉద్యమ సింహం’తో పాటు శ్రీకాంత్ హీరోగా ‘తెలంగాణ దేవుడు’ టైటిల్స్‌తో సినిమాలు కూడా తెరకెక్కాయి. కానీ ఈ సినిమాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మరి రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ బయోపిక్‌లోని ఏ యాంగిల్‌ను తీసుకొని తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరి చెప్పినట్టే.. ఆర్జీవి ఈసారైనా కేసీఆర్ బయోపిక్‌ను అనుకున్నట్టే తెరకెక్కిస్తారా లేకుండా పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..